Breaking News

26న పెన్షన్‌ దారుల సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటివరకు పెన్షన్‌ పొందని వారి కోసం ఈనెల 26వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పెన్షన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.అంజయ్య తెలిపారు.

డైరెక్టర్‌ అకౌంట్‌ జనరల్‌ (ఏజీ) హైదరాబాద్‌ చెందిన వారి సమక్షంలో సర్వీస్‌, ఫ్యామిలీ పింఛన్‌దారుల సమస్య పరిష్కారం కాని వారు సమావేశానికి హాజరై పరిష్కరించు కోవాలని, సమావేశానికి సంభందిత శాఖల డిడిఓలు పూర్తి సమాచారంతో తప్పని సరిగా హాజరు కావాలని డిఅర్‌ఓ కోరారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *