Breaking News
నర్సరీని పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

నర్సరీ పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి

నిజాంసాగర్‌, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలని పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హాసన్‌పల్లి గ్రామంలో నర్సరీ మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కలకు ప్రతిరోజు మూడు సార్లు మంచి నీటిని పట్టి వాటి ఎదుగుదల చూడాలని అన్నారు. హసన్‌పల్లి గ్రామంలో నర్సరీలో 40 వేల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు.

ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ 5 మొక్కలను నాటి వాటి సంరక్షణ చేయాలని అన్నారు. చెట్లు పెంచడం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, అలాగే గాలి కూడా వస్తుందన్నారు. మానవుని మనుగడకు చెట్లు ఎంతో అవసరమన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే రైతులకు మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి వెంట ఫీల్డ్‌ అసిస్టెంట్‌ క్యాస బాలరాజు, కారోబార్‌ లింగాల రాములు, సుంకే బాలరాజు తదితరులు ఉన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *