Breaking News

Daily Archives: June 25, 2019

హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన ఎస్‌పి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల నరికివేత, వృక్ష సంపద కాపాడుకోకపోవడం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అటవీ సంపదను రక్షించుకోవడంతోపాటు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతోపాటు నీటిని సమకూర్చుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి ...

Read More »

పోలీసు కవాతు

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఆర్‌ఏఎఫ్‌ ఫోర్సు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఆర్‌ఏఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎన్‌వి.రావు, ఇన్స్‌పెక్టర్‌ సి.కె.రెడ్డి, ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, సబ్‌ ఇన్స్‌పెక్టర్లు గోవిందు, మజర్‌, రవి, రాములు, రవిందర్‌రెడ్డిలతోపాటు పోలీసు బలగాలు కవాతులో పాల్గొన్నాయి.

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఫీజుల దోపిడిని అరికట్టడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. దగ్దం చేస్తుండగా పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు డొనేషన్లు, ...

Read More »

ఓటర్ల జాబితా సిద్దం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళా ఓటర్ల ఎలక్టోరల్‌ జాబితా వచ్చేనెల 6వ తేదీ లోగా పోలింగ్‌ స్టేషన్ల వారిగా డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ వెలువరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపల్‌ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మునిసిపాలిటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల సర్వేపై సమీక్షించారు. సర్వే సంబంధించి వచ్చేనెల 4వ తేదీ వరకు డోర్‌ టు డోర్‌ ...

Read More »

మహిళ ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ గ్రామానికి చెందిన శ్రీజయ అనే మహిళ మంగళవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు తెలిపారు. శ్రీజయ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ప్రాజెక్టు గ్రీసింగ్‌ పనుల పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు, సింగీతం ప్రాజెక్టుకు గ్రిసింగ్‌ ఆయిల్‌ పనులను ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈఈ ప్రణయ్‌ రెడ్డి, శివప్రసాద్‌లు పరిశీలించారు. అనంతరం డిప్యూటీ ఈఈ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రాజెక్టుకు గ్రీసింగ్‌ పనులను చేపట్టడం జరుగుతుందని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ కాశీనాథ్‌, తదితరులు ఉన్నారు.

Read More »

సమయపాలన పాటించాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంపిడిఓ పర్బన్నా అన్నారు. నిజాంసాగర్‌ మండలం మొహమ్మద్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థినులకు ఉపాధ్యాయులు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »

హరితహారానికి సిద్దమవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు ప్రారంభమైనందున హరిత హారంలో మొక్కలు నాటడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నందున లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలలో, మున్సిపాలిటీలలో రహదారుల ప్రక్కన, ఇతర ప్రాంతాలలో మొక్కలను పెద్ద ...

Read More »

భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ రెవెన్యూ భూముల విషయంలో సంయుక్త విచారణ జరిపి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు శాఖలకు సంబంధించిన భూముల వివరాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను ఇరు శాఖల సంయుక్త విచారణ ద్వారా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అటవీశాఖ హద్దులకు సంబంధించి కూడా అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు. రెవెన్యూ భూములకు ...

Read More »

30లోగా ఓటర్ల గణన పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో బిసి ఓటర్ల గణన సర్వే ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో రాబోయే ఎన్నికల ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బీసీ ఓటర్ల గణన సర్వే జూలై 4వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వము నిర్దేశించిన నందున జిల్లాలో మాత్రం ఈనెల 30వ తేదీలోగా పూర్తి ...

Read More »

అభివద్ధిలో భాగస్వాములైనందుకు అభినందనలు

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదు సంవత్సరాల పాటు నగర అభివద్ధిలో భాగస్వాములైనందుకు పాలక వర్గాన్ని అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. నగరపాలక సంస్థ ఐదు సంవత్సరాల పాటు పాలకవర్గం కాలపరిమితిని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో స్థానిక భూమరెడ్డి కన్వెన్షన్‌ హాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. నగర మేయర్‌ ఆకుల సుజాత, నగర శాసనసభ్యులు గణేష్‌ గుప్తా, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, ...

Read More »

ఆర్థిక గణన పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆర్థిక విషయాలకు సంబంధించి గణన పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఏడవ ఆర్థిక గణనకు సంబంధించి సెన్సస్‌ నిర్వహించే సూపర్‌వైజర్లకు ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాథమిక ఉత్పత్తి విద్యుత్తు సరఫరా త్రాగునీటి సరఫరా నిర్మాణాలు, వ్యాపారాలు సేవలకు సంబంధించిన ప్రజలకు అందుతున్న సేవలు ప్రజల ఆర్థిక అభివద్ధిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడవ ...

Read More »