Breaking News

ప్రాజెక్టు గ్రీసింగ్‌ పనుల పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు, సింగీతం ప్రాజెక్టుకు గ్రిసింగ్‌ ఆయిల్‌ పనులను ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈఈ ప్రణయ్‌ రెడ్డి, శివప్రసాద్‌లు పరిశీలించారు. అనంతరం డిప్యూటీ ఈఈ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రాజెక్టుకు గ్రీసింగ్‌ పనులను చేపట్టడం జరుగుతుందని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ కాశీనాథ్‌, తదితరులు ఉన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *