Breaking News

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఫీజుల దోపిడిని అరికట్టడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. దగ్దం చేస్తుండగా పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు డొనేషన్లు, అక్రమ ఫీజులను యథేచ్చగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *