Breaking News

ఓటర్ల జాబితా సిద్దం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళా ఓటర్ల ఎలక్టోరల్‌ జాబితా వచ్చేనెల 6వ తేదీ లోగా పోలింగ్‌ స్టేషన్ల వారిగా డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ వెలువరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపల్‌ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మునిసిపాలిటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల సర్వేపై సమీక్షించారు. సర్వే సంబంధించి వచ్చేనెల 4వ తేదీ వరకు డోర్‌ టు డోర్‌ సర్వే చేపట్టనున్నారు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు నమోదు చేయడం జరుగుతుందని, ఓటర్లను గుర్తించి మాస్టర్‌ కాపీలో నమోదు చేస్తారని తెలిపారు.

6న జాబితా వెలువరించాలన్నారు. 7 నుంచి 11వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత ప్రోఫార్మాలో స్వీకరించాలని పేర్కొన్నారు. 12 నుంచి 16 వరకు అభ్యంతరాల పరిశీలన చేయాలని, 19న తుది జాబితా ప్రకటించాలని సూచించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, సిపివో శ్రీనివాస్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, ఎల్లారెడ్డి ఇన్‌చార్జి కమీషనర్‌ చిన్నారెడ్డి, కామారెడ్డి ఎంఇ వాసుదేవరెడ్డి, టిపివో శైలజ, బాన్సువాడ కమీషనర్‌ కుమారస్వామి, కామారెడ్డి తహసీల్దార్‌ రవీందర్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *