Breaking News

Daily Archives: June 26, 2019

మండల కేంద్రంలో హీరో సంపూర్ణేష్‌బాబు సందడి

నసురుల్లాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బుధవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. గ్రామంలో బుధవారం ‘రాగల 24 గంటలు’ సినీ నిర్మాత కె.శ్రీనివాస్‌ మిత్రుని కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సంపూర్ణేష్‌ బాబు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా గ్రామంలోని యువకులతో సెల్ఫీలు దిగారు. సంపూర్ణేష్‌ను చూడటానికి యువకులు ఉత్సాహపడ్డారు.

Read More »

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. బుధవారం తన చాంబరులో జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక వనరుల లభ్యతపై సమీక్షించారు. రెండు పడక గదుల ఇళ్లు, ఆర్‌అండ్‌బి, ప్రభుత్వ, ప్రయివేటు నిర్మాణాలకు సంబంధించి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరముంటుందని తెలిపారు. ఇసుక లభ్యతపై జాయింట్‌ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా ఖని భూగర్భశాఖ, భూగర్భ జలవనరుల ...

Read More »

అటవీశాఖ ద్వారా 95 లక్షల మొక్కల పెంపకం

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ ద్వారా మొత్తం 95 లక్షల మొక్కలను పెంచడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ హైవే వెంట మొక్కలు నాటే కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని అంతంపల్లి నర్సరీ వద్ద హైవే వెంబడి మొక్కలు నాటారు. నేషనల్‌ హైవే బస్వాపూర్‌ నుంచి దగ్గి వరకు 56 కి.మీల వెంబడి 7 వేల 100 మొక్కలు నాటడం లక్ష్యంలో ...

Read More »

ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక అందించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను లభ్యత ప్రాంతాల నుంచి అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, తెలంగాణ రాష్ట్ర మైన్స్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ మల్సర్‌లతో కలిసి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నర్మల గ్రామం వద్దగల అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద లభ్యమయ్యే ఇసుకను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రదేశంలో ఇసుకతీత, ఇసుక లభ్యతపై వెంటనే ...

Read More »

వేతనాల కోసం బల్దియాకు తరలిన కార్మికులు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ విలీన గ్రామాల కార్మికులు తమ వేతనాల కోసం బుధవారం కామారెడ్డి బల్దియా కార్యాలయాన్ని ముట్టడించారు. మునిసిపల్‌ సమావేశ మందిరంలోకి చొచ్చుకొని వచ్చి ఛైర్మన్‌కు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరునెలల నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదని, మునిసిపల్‌ విలీన గ్రామాల కార్మికులమైన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అక్కడి నుంచి నిష్క్రమించడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క తాము వేతనాలు రాక ...

Read More »

పారిశుద్య పనుల పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంగుళూర్‌ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బాలరాజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాన కాలం ప్రారంభం కావడంతో మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గైని స్వప్న రమేష్‌, తదితరులు ఉన్నారు.

Read More »

దళితులకు బోరు మోటార్ల పంపిణీ

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని నాయకులు ధపెదర్‌ విజయ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందన్నారు. వారికి బోరు మోటార్లు సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, మూడు ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాశయ్య, మహేందర్‌, వాజిద్‌ అలీ, కారోబార్‌ అంబయ్య, తదితరులు ఉన్నారు.

Read More »

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గైని విఠల్‌

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌, పిట్లం మండలాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా గైని విట్ఠల్‌ను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నారం వెంకట్రాంరెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి స్థానిక ఎన్నికల్లో జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా అప్పటినుంచి చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న నర్సింగ్‌రావు పల్లి గ్రామానికి చెందిన గైనివిట్ఠల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ...

Read More »

పెన్షన్‌ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల పెన్షన్‌ కేసులు పెండింగ్‌ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, డిడిఓ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఉద్యోగుల పెన్షన్‌ కేసులపై అకౌంట్‌ జనరల్‌ అధికారుల ఆధ్వర్యంలో డిడివోలు పెన్షనర్ల తో సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సంబంధించి ఒక సంవత్సరం ముందుగానే వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని కనీసం ఆరు నెలలకు తక్కువ కాకుండా పెన్షన్‌ ...

Read More »