Breaking News

దళితులకు బోరు మోటార్ల పంపిణీ

నిజాంసాగర్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని నాయకులు ధపెదర్‌ విజయ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందన్నారు. వారికి బోరు మోటార్లు సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, మూడు ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాశయ్య, మహేందర్‌, వాజిద్‌ అలీ, కారోబార్‌ అంబయ్య, తదితరులు ఉన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article