Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

పెన్షన్‌ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల పెన్షన్‌ కేసులు పెండింగ్‌ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, డిడిఓ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఉద్యోగుల పెన్షన్‌ కేసులపై అకౌంట్‌ జనరల్‌ అధికారుల ఆధ్వర్యంలో డిడివోలు పెన్షనర్ల తో సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సంబంధించి ఒక సంవత్సరం ముందుగానే వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని కనీసం ఆరు నెలలకు తక్కువ కాకుండా పెన్షన్‌ దరఖాస్తులను అకౌంటెంట్‌ జనరల్‌కు పంపించడానికి జిల్లా అధికారులు, రిటైర్‌ కాబోయే ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా రిటైర్‌మెంట్‌ సమయానికల్లా పెన్షన్‌ బెనిఫిట్స్‌ పొందడానికి వీలవుతుందని తెలిపారు.

ఉద్యోగి నుండి రికవరీ చేయవలసిన ఔట్‌స్టాండింగ్‌ డ్యూస్‌ ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని పెన్షన్‌లో గాని లేదా కార్యాలయం ద్వారా రికవరీ చేసి కానీ పెండింగ్‌ లేకుండా చేయడం ద్వారా పెన్షన్‌ సకాలంలో మంజూరు కావడానికి వీలవుతుందన్నారు. కోర్టు కేసులు మినహా ఇతర పెండింగ్‌లో ఉన్న అన్ని పెన్షన్‌ కేసులను సత్వరం పరిష్కరించడానికి అటు అధికారులు, ఇటు పెన్షనర్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పెన్షన్‌ దరఖాస్తులు సమర్పించే ముందు ఉద్యోగితోపాటు పెన్షన్‌ మంజూరు చేసే అధికారి అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అకౌంటెంట్‌ జనరల్‌కు పెన్షన్‌ ఫారాలు పంపే ముందు మరొకసారి అన్ని వివరాలను రూఢీ చేసుకొని పంపించడం ద్వారా సకాలంలో పెన్షన్‌, పెన్షనరీ బెనిఫిట్స్‌ పొందడానికి వీలవుతుందన్నారు.

ముఖ్యంగా ఉద్యోగి భార్య లేదా భర్త పేరు, కుటుంబ సభ్యుల వివరాలు సరిగా పొందుపరచాలన్నారు. ఈ విషయమై పలు సమావేశాల్లో ఇప్పటికే ఇలా అధికారులకు సూచించడం జరిగిందని ఈ దిశగా కొంత సఫలీకతం జరిగిందని అధికారులు మరింత కషి చేస్తే ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసి రిటైర్‌ అయిన ఉద్యోగులకు సకాలంలో పెన్షన్‌ మంజూరు చేయడం ద్వారా వారు రిటైర్‌మెంట్‌ సమయంలో సంతోషంగా ఉండడానికి తోడ్పడిన వారమవుతామన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రెవెన్యూ విద్యాశాఖ రిజిస్ట్రేషన్లు పోలీసు ఎక్సైజ్‌ పంచాయతీ రాజ్‌ తదితర శాఖల్లో కొంతమేర పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించడానికి రియల్‌ తీసుకోవాలన్నారు.

సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ సునీత గుణశేఖర్‌ మాట్లాడుతూ ఉద్యోగి వివరాలకు సంబంధించి పార్ట్‌ 1 లోని వివరాలు సరిగా భర్తీ చేయాలని నామిని లుగా మైనర్లు ఉంటే గార్డియన్‌ పేరు తప్పకుండా నమోదు చేయాలని పెన్షన్‌ పారాలు పంపే ముందు భార్యాభర్తల జాయింట్‌ ఫోటో జత చేయాలని పెన్షన్‌ అర్హత సరిగ్గా చూసుకొని దరఖాస్తులు పంపాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఏజి ఆఫీస్‌ సీనియర్‌ అకౌంటెంట్‌ విజయ, జిల్లా ట్రెజరీ అధికారి రామ్మోహన్‌ నాయుడు, పలు శాఖలకు చెందిన డిడిఓలు, జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *