63 వాహనాల స్వాధీనం
నిజాంసాగర్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ స్థాయిలోని సిఐలు, ఎస్ఐ లు, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు బందాలుగా వెళ్లి రాజ్ నగర్ దుబ్బలోని ఇంటిటికి తిరిగి వాహనాలు, పత్రాలు తనిఖీ చేశారు. ఆర్మూర్ డివిజన్ ఏసిపి అందె రాములు కార్డేన్ సెర్చ్ పర్యవేక్షించారు. ఇళ్లలో పత్రాలు లేని వాహనాలను తమ అధీనంలో తీసుకొని కొత్తూర్ రోడ్లోని గోదాంలో ఉంచారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలను, ట్రాక్టర్, 5 ఆటోలు స్వాధీనం చేసుకొన్నారు. నందిపేట్లో ఇలాంటి. కార్డాన్ సెర్చ్ చేయడం రెండవ సారి, గతంలో సిపి కార్తికేయ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శాంతి భద్రతల కొరకే కార్డాన్ సెర్చ్ : ఏసిపి అందె రాములు
ఆర్మూర్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ కొరకే ఇలాంటి కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసిపి అందె రాములు తెలిపారు. గురువారం సాయంత్రం నందిపేట్ లోని రాజ్నగర్ దుబ్బలో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎస్ఐ రాఘవేందర్, నాయకులు ఎస్ జి తిరుపతి, మాన్పుర్ భూమేష్ తదితరులు మాట్లాడారు.

Latest posts by Nizamabad News (see all)
- ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం - December 14, 2019
- మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం - December 14, 2019
- సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి - December 14, 2019