Breaking News

Daily Archives: June 28, 2019

వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం చిక్రి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్నందున నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ మిషన్‌ భగీరథ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వైరల్‌ జ్వరాలు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను గతంలో ఆదేశించినట్లు చెప్పారు. కొత్తపల్లి గ్రామంలో జరిగిన సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా అప్రమత్తంగా ...

Read More »

డిఆర్వోకు సన్మానం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇటీవల జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు విజయవంతమయ్యేందుకు పూర్తి సహకారం అందించిన డిఆర్‌ఓ అంజయ్యను జిల్లా పరిషత్‌ సీఈవో డిప్యూటీ సీఈఓ శుక్రవారం సాయంత్రం సన్మానించారు. జిల్లాలో జరిగిన జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా డిఆర్‌ఓ సూచనలు సలహాలతో పాటుగా పూర్తి సహకారం అందించారని వారి సేవలకు గుర్తుగా పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించినట్లు సీఈవో డిప్యూటీ సిఓ వేణు గోవిందు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయం పరిపాలన అధికారి ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల సంఘం (తెరసం) మూడవ రాష్ట్ర మహాసభకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. స్థానిక కేర్‌డిగ్రీ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహస్వామి తదితరులు గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఘనపురం దేవేందర్‌, దారం గంగాధర్‌, తొగర్ల సురేశ్‌, ఎలగందుల లింబాద్రి, చెన్న శంకర్‌, మద్దుకూరి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా ప్రతినిధులకు అధికారులకు సన్మానం

రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియడంతో మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీటీసీలకు ఎంపీపీ మొబిల్‌ ఖాన్‌, జెడ్పిటిసి నాగభూషణ్‌ రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివద్ధికి ప్రజలకు ఎంతో సేవ చేశారని వారి సేవలను కొనియాడారు. ఎంపిపి మోబిన్‌ ఖాన్‌, జడ్పీటీసీ నాగభూషన్‌ రెడ్డిల పదవీ కాలం ముగియడంతో వారికి మండల అధికారులు, సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు ఘనంగా సన్మానించారు. రెంజల్‌ మండల అభివద్ధికి వారు నిరంతరం కషి ...

Read More »

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం పోచంపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో అలీ సాగర్‌ కాలువ ఆనకట్ట అనుకొని ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్డు వలన జరిగే ప్రమాదాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో నర్సరీ పరిశీలన కోసం వెళ్ళగా కాలువకు ఆనుకున్న ఆర్‌అండ్‌బి రోడ్‌ క్రాసింగ్‌ వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ...

Read More »

వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఋతు పవనాలతో వర్షాలు కురవడం ప్రారంభమైనందున హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన మాక్లూర్‌ మండలం చిన్నా పూర్‌ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీని, ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో డ్వామా ఆధ్వర్యంలోని నర్సరీ, నిజామాబాద్‌ మండలం మల్కాపూర్‌ గ్రామంలో నర్సరీలను పరిశీలించి మొక్కలను గమనించారు. నర్సరీలలో టేకు, సుగంధం, చింత, ఈత, పూల మొక్కలు, పారిజాతం, కానుగ, మునగ, ...

Read More »

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి

రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపీపీ మొబిన్‌ ఖాన్‌ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సర్వసభ్య సమావేశం ముగించారు. వ్యవసాయ శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి శాఖల అధికారుల పనితీరుపై ఎంపిటిసిలు, సర్పంచ్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాన్స్‌ కో ...

Read More »

పాఠశాలల తనిఖీ

రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, దూపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ తదుపరి తెలంగాణ మోడల్‌ పాఠశాల, దూపల్లి పాఠశాలలు తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం, అడ్మిషన్ల రిజిస్టర్‌, నెలవారి సిలబస్‌, టీచర్‌ డైరీలు పరిశీలించిన ఆయన విద్యార్థులు, ...

Read More »

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

బీర్కూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో శుక్రవారం పిఆర్‌టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్వహించారు. గత విడత యుపిఎస్‌ మైలారంను దత్తత చేసుకొని అభివద్ధి చేశామని, ఈ సంవత్సరం బొమ్మన్‌దేవుపల్లి జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలను అభివద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉన్నతమైన విద్య కోసం పాటుపడతామని కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గున్గెఉరీ హనుమాండ్లు, జిల్లా బాధ్యులు భూషన్‌, శ్రీచంద్‌, మండల ఉపాధ్యాయులు ...

Read More »

ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల స్టడీ సర్కిల్‌ వారు రాష్ట్ర స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలకు గాను నిజామాబాద్‌లో తలపెట్టిన అయిదున్నర నెలల ఉచిత శిక్షణ ప్రవేశ అర్హత కొరకు ఈనెల 30న నిర్వహించదలచిన ప్రవేశ పరీక్ష జూలై ఏడవ తేదీన కేర్‌ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌లో జరుగుతుందని షెడ్యూలు కులాల అభివద్ధి అధికారి సబీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హాల్‌టికెట్లు రెండు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. మరింత ...

Read More »