Breaking News

వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం చిక్రి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్నందున నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ మిషన్‌ భగీరథ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వైరల్‌ జ్వరాలు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను గతంలో ఆదేశించినట్లు చెప్పారు. కొత్తపల్లి గ్రామంలో జరిగిన సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సి పరిధిలో గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, మంచినీటి క్లోరినేషన్‌, గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికి సర్వే సర్వే చేయాలని జ్వరాల బారిన పడిన వెంటనే శస్త్ర చికిత్సలు చేపట్టాలని గ్రామంలో మరిన్ని రోజులపాటు వైద్య శిబిరం కొనసాగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్‌ను ఆదేశించారు. గ్రామంలో సానిటేషన్‌ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు మంచినీటి వనరులను చేసి శుభ్రంచేసి క్లోరినేషన్‌ గల నీటిని సరఫరా చేయాలని ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌ పరిశీలన చేసి నివేదిక అందజేయాలని మిషన్‌ భగీరథ ఎస్‌ ఈ ఆదేశించారు. వాతావరణంలో మార్పుల కారణంగా క్రిమికీటకాల వలన కూడా వైరల్‌ వ్యాధులు ప్రబలవచ్చని, కొందరికి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని నివేదికను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని, గత పది రోజుల నుండి మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తున్నట్లు వ్యాధులు నయం అయ్యేవరకు క్యాంపు కొనసాగిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలెక్టర్‌కు వివరించారు.

కొత్తపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా త్రాగునీటి వనరులను పరిశీలించామని నమూనాలు సేకరించి ల్యాబ్‌ పంపించగా నెగెటివ్‌ వచ్చినట్లు ఎస్‌ఈ రాజేంద్ర కుమార్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జిల్లాలో సీజనల్‌ వైరల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి చుట్టూ గ్రామాలలో ఈ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకుపోవాలని కలెక్టర్‌ సూచించారు సమావేశంలో ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *