Breaking News

Daily Archives: June 30, 2019

సోమవారం కామారెడ్డికి కలిసి నడుద్దాం కార్యక్రమం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, యువజన రాష్ట్ర నాయకుడు రాజిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కలిసి నడుద్దాం కార్యక్రమం సోమవారం కామారెడ్డికి చేరుకుంటుందని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అద్యక్షుడు కోయల్‌కర్‌ కన్నయ్య తెలిపారు. సోమవారం ఉదయం పదిగంటలకు కామారెడ్డికి నాయకులు చేరుకుంటారన్నారు. కామారెడ్డిలో కార్యక్రమం అనంతరం అన్ని మండల యువజన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంటి వద్ద సమావేశం ఉంటుందన్నారు. దీనికి పార్టీ నాయకులు ...

Read More »

చినుకు పడితే చిత్తడే…

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. ఆదివారం కురిసిన చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నడవడానికి కూడా ఇబ్బందిగా మారాయి. అయ్యప్పనగర్‌ కాలనీ, బతుకమ్మ కుంట, ఆర్‌బి నగర్‌, ఎరుకలవాడ, హరిజనవాడ వంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మధ్య నీరు నిలిచి ద్విచక్ర వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్తితి ఉంటే వర్షాలు భారీగా కురిసినప్పుడు గుంతలు ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కామారెడ్డిలో పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరిపారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తామని పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌లు పార్టీ సభ్యత్వనమోదులో పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, నాయకులు ముజీబుద్దీన్‌, ...

Read More »

పారిశుద్య నిర్వహణలో కామారెడ్డి బల్దియా అస్తవ్యస్తం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్య వ్యవస్థ నిర్వహణలో కామారెడ్డి బల్దియా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పట్టణంలోని ఏ వార్డులో చూసినా చెత్త దర్శనమిస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ వార్డు నుంచి 10 వార్డుల్లో పర్యటించారు. పారిశుద్యం, రోడ్లు, నీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చెత్తను ఎత్తి డంపింగ్‌ యార్డుకు తరలించకపోవడంతో కామారెడ్డి చెత్తకు ...

Read More »

హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మొక్కలునాటి సంరక్షించాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో హిందీ ఉపాధ్యాయులు గఫూర్‌ శిక్షక్‌ హరితహారానికి సంబంధించి రాసిన హిందీ నినాదాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తు సామాజిక బాధ్యతతో హరితహారంపై రాసిన నినాదాలు బాగున్నాయని ప్రశంసించారు. గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ అన్ని పాఠశాలలకు నినాదాల కరపత్రాలను ...

Read More »

కోమలంచ నర్సరీ పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో నర్సరీని పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలన్నారు. నర్సరీలో 80వేల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఆయన వెంట సాదుల సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Read More »

సోమవారం కల్లా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన సోమవారం వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలో పర్యటించి ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పునర్విభజన కార్యక్రమాలకు సంబంధించి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డుల పునర్విభజన ప్రచురణ కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం ...

Read More »

ప్రభుత్వ వైద్యాలయాలు.. ప్రసూతికి నిలయాలు

ప్రైవేటుకు ధీటుగా మెరుగైన సేవలు రెంజల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాలంటేనే గర్భిణీలు ఆమడ దూరంలో ఉండేవారు. అప్పు చేసైనా ప్రైవేట్‌ ఆస్పత్రిలో పురుడు పోసుకునే వారు. కడు పేదరికంలో ఉన్నా తల్లి పాల క్షేమం కోరి పట్టణాలకు పరుగులు తీసే వారు. సర్కారు ఆసుపత్రిలో వైద్యులు ఉన్నా కాన్పులు చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. నెలకు ఐదో ఆరో కాన్పులు చేసేవారు. కానీ రోజులు మారాయి. వైద్యులు మారారు. పేదలకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ...

Read More »