Breaking News

హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మొక్కలునాటి సంరక్షించాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో హిందీ ఉపాధ్యాయులు గఫూర్‌ శిక్షక్‌ హరితహారానికి సంబంధించి రాసిన హిందీ నినాదాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తు సామాజిక బాధ్యతతో హరితహారంపై రాసిన నినాదాలు బాగున్నాయని ప్రశంసించారు.

గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ అన్ని పాఠశాలలకు నినాదాల కరపత్రాలను అందజేస్తామన్నారు. చెట్లు మానవజాతికి చేసే ఉపకారాన్ని నినాదాల ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో హిందీ శిక్షక్‌ సమితి అధ్యక్షుడు ఎం.ఎ.బషీర్‌, ప్రధానోపాధ్యాయుడు లింబాద్రి, సామాజిక వేత్త చంద్రకాంత్‌ తదితరులున్నారు.

Check Also

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని ...

Comment on the article