Breaking News

పారిశుద్య నిర్వహణలో కామారెడ్డి బల్దియా అస్తవ్యస్తం

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్య వ్యవస్థ నిర్వహణలో కామారెడ్డి బల్దియా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పట్టణంలోని ఏ వార్డులో చూసినా చెత్త దర్శనమిస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ వార్డు నుంచి 10 వార్డుల్లో పర్యటించారు. పారిశుద్యం, రోడ్లు, నీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చెత్తను ఎత్తి డంపింగ్‌ యార్డుకు తరలించకపోవడంతో కామారెడ్డి చెత్తకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త వర్షం కారణంగా ప్రజల ఇళ్లముందుకు, తిరిగి కాలువల్లోకి కొట్టుకుపోతుందన్నారు. దీని వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతుందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో వెంటనే చెత్త తొలగించి స్వచ్చ కామారెడ్డిగా మార్చాలని కోరారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

Check Also

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ...

Comment on the article