Breaking News

చినుకు పడితే చిత్తడే…

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. ఆదివారం కురిసిన చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నడవడానికి కూడా ఇబ్బందిగా మారాయి. అయ్యప్పనగర్‌ కాలనీ, బతుకమ్మ కుంట, ఆర్‌బి నగర్‌, ఎరుకలవాడ, హరిజనవాడ వంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మధ్య నీరు నిలిచి ద్విచక్ర వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్నపాటి వర్షానికే ఈ పరిస్తితి ఉంటే వర్షాలు భారీగా కురిసినప్పుడు గుంతలు తెలియక ప్రమాదాల బారిన పడే ఆస్కారముందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను బాగుచేయాలని విన్నవిస్తున్నారు.

Check Also

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని ...

Comment on the article