Breaking News

Monthly Archives: July 2019

ప్రసాద్‌ సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌర సరఫరా అధికారిగా పనిచేస్తూ పిఎల్‌ వి.వి ప్రసాద్‌ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అతి చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం పొంది అంచలంచలుగా ఎదుగుతూ 35 సంవత్సరాల పాటు పని చేయడం గొప్ప విషయమని అన్నారు. ఆయన సేవలు జిల్లాలో అందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్లో ...

Read More »

ఓటరు పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 16 నుండి సెప్టెంబర్‌ 30 వరకు చేపట్టే ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం మధ్యాహ్నం ఫోటో ఓటర్‌ జాబితా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జనవరి 1, 2020 అర్హత తేదీగా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ ప్రకటించినట్లు చెప్పారు. ఈ ...

Read More »

మానవ జీవితానికి సార్ధకత పరోపకారమే

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా షోనపూర్‌కు చెందిన సరిత అనే మహిళ కామారెడ్డి సాయిసింహ వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడడంతో ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో వారు చిన్న మల్లారెడ్డిలో ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఐదవసారి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగింది. రక్తదాతకు కామారెడ్డి రక్త దాతల సమూహం తరపున బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ...

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ పక్కన చర్చ్‌ ముందు గల టీజీవిపి జెండాను రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిజివిపి 2012 జులై 31న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులతో టిజివిపి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టిజివిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవిర్భవించడం జరిగిందని, తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుండి ...

Read More »

ఆడపిల్లకు అండగా తెలంగాణ సర్కార్‌

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గల మండల పరిషత్‌ కార్యాలయంలో మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నూతన మండలంగా ఏర్పడిన నాగాల్గిద్ద ప్రాంతాన్ని మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివద్ధి చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాల్లో, పట్టణాలలో అభివద్ధి జరుగుతుందని అన్నారు. ఆడపడుచులకు అండగా ఉండేందు కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణ ...

Read More »

పేదల ఆపద్బాంధవుడు కేసీఆర్‌

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల ఆపద్బాంధవుడు సిఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. నిజాంపేట్‌ గ్రామానికి చెందిన బెంగరి రాములు తండ్రి కిష్టయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దవాఖాన ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి బుధవారం అందజేశారు.

Read More »

టిజివిపి ధర్నా

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా డిపో మేనేజర్‌ కార్యాలయము ముందు టిజివిపి ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ లింగంపేట్‌ మండలంలోని చెట్‌పల్లి, సంగారెడ్డి, పర్మల్లా, పర్మల్లా తండా, గ్రామాలకు చెందిన విద్యార్థులు లింగంపేట్‌ మండలంలోని కళాశాలలో చదివే విద్యార్థులు కళాశాలకు ఆలస్యంగా రావడంతో గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఒక్క గంట ముందు రావాలని ...

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగల్‌ గిడ్డ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఆవరణలో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని అన్నారు. చెట్లు పెంచడంతో ఎన్నో లాభాలున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కామరెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 26 వార్డులో 78 లక్షల 76 వేల రూపాయలతో, 27వ వార్డులో 1 కోటి 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సీసీ మురుగు కాల్వల నిర్మాణ పనులకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 1 కోటి 60 లక్షల రూపాయలతో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన వెంట తెరాస నాయకులు, ...

Read More »

మెయిన్‌ రోడ్డా… నీటి కుంటలా…

నందిపేట్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద గల ప్రధాన రహదారి అద్వాన్నంగా మారడంతో మండల ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా రోడ్డు సమస్య వేదిస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు గాని, కేంద్రంలో ఉన్న పాలకులు గాని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల వేళ రహదారి సమస్య గురించి మాట్లాడే నాయకులు ఎన్నికలు అయిపోగానే దీన్ని మరిచిపోతున్నారని వాపోయారు. పత్రికలలో కథనాలు ...

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన ఎస్‌ఈ

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 12 ,16 ,20 వరద గేట్లతో పాటు కళ్యాణి, సింగీతం ప్రాజెక్టు జలాశయాలను బుధవారం ఉమ్మడి జిల్లాల నీటి పారుదల శాఖ ఎస్‌ఈ మురళీధర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈ శివ ప్రసాద్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీరు లేకపోవడం వల్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఇ విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌ వరద గేట్ల ...

Read More »

నెల నెలా వేతనాలు ఇప్పించండి

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు బోధన్‌ డివిజన్‌ పరిధిలో 100 మంది వరకు ఛార్జ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నామని ప్రతినెల వేతనాలు రాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోధన్‌ నీటి పారుదల శాఖ ఈఈ మధుకర్‌ రెడ్డికి చెప్పారు. బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వచ్చిన ఎస్‌ఈ మురళీధర్‌తో పాటు ఈఈ మధుకర్‌ రెడ్డి వచ్చారు. ఈఈని కలిసి రెండు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ కొనసాగాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి యువతకు అవకాశం కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. యువతను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతను ప్రోత్సహించడానికి ఆవిష్కరణలతో ముందు వచ్చే వారికి వారి సజనాత్మకతను, ఇన్నోవేషన్‌ వెలికి తీయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌ సెల్‌ను ప్రారంభించిందని కలెక్టర్‌ తెలిపారు. కొత్తగా ఆవిష్కరణలను కనుగొనే వారికి పౌరులు ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావడానికి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తేవడం జరిగిందని ...

Read More »

కొనసాగుతున్న వరద – స్వల్పంగా వచ్చి చేరిన నీరు

రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో గోదావరి వరద నీరు నిలకడగా ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తివేసినా మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీరు రాకపోవడంతో నీటి మట్టం నిలకడగా ఉంది. మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షంతో కొంతమేర వరద నీరు రావడంతో కందకుర్తి త్రివేణి సంగమంలో స్వల్పంగా నీరు చేరింది.

Read More »

గుర్తుతెలియని బాలుడిని పోలీసులకు అప్పగింత

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో బుధవారం గుర్తు తెలియని బాలుడిని గుర్తించిన గ్రామస్థులు 1098కు ఫోన్‌ చేసి చైల్డ్‌ లేబర్‌ వారికి సమాచారం అందించడంతో గ్రామ సర్పంచ్‌ రాజు, సామాజిక కార్యకర్త శ్రీకాంత్‌ పోలీస్‌ స్టేషన్లో బాలుడిని అప్పగించారు. పోలీసులు బాలుని వివరాలు ఆరా తీయగా ధర్మాబాద్‌కు చెందిన చరణ్‌ తండ్రి పేరు మోహన్‌గా తెలిపారు.

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్ధన సమయనికి పాఠశాలకు చేరుకుని ప్రార్థన గీతంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరుశాతం, టీచర్‌ డైరీలను పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూరిబా ప్రత్యేకాధికారి మమత, ఉపాధ్యాయురాలు ఉన్నారు.

Read More »

హరితహారం లక్ష్యాలు పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఎంపీడీవోలను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలతో హరితహారం, జలశక్తి అభియాన్‌, ఆసరా పింఛన్లు, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలపై మాట్లాడారు. జిల్లాలో వర్షాలు సంత ప్తికరంగా కురుస్తున్నందున నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా హరిత కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. ఏకకాలంలో గుంతలు తీయడం, మొక్కలు నాటడం, జియో ట్యాగింగ్‌, నాటిన మొక్కల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ...

Read More »

బాధితులకు జడ్పీటీసీ సాయం

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల విద్యుత్తు షాట్‌ సర్క్యూట్‌తో ఇండ్లు దగ్దమైన పెద్ద కొడప్‌గల్‌ మండలం విట్ఠల్‌ వాడి తండాకు చెందిన పవార్‌ పాప నాయక్‌, పవార్‌ శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబాలకు బుదవారం జడ్పీటీసీ చంద్రబాగ దుస్తులు, దుప్పట్లు, క్వింటాలు బియ్యం ఉచితంగా అందచేశారు. ఇల్లు దగ్దమైన కుటుంబాలలో గల 13 మందికి చీరలు, దోవతులు, ప్యాంట్లు, షర్టులు అందించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాకారం కూడా అందే విధంగా కషి ...

Read More »

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సోమవారం పలు అభివృద్ది పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని 32 వార్డులో రూ. 2.16 కోట్లతో సిసి రోడ్లు, సిసి డ్రెయిన్లు నిర్మాణ పనులకు, రూ. 26 లక్షలతో శిశు మందిర్‌ పాఠశాల నుండి హానీ బేకరి వరకు నిర్మించనున్న పైప్‌ లైన్‌ నిర్మాణాలకు, జంగంపల్లి గ్రామంలో రూ. 24 లక్షలతో నిర్మించనున్న పిఏసీఎస్‌ భవన నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ...

Read More »

అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్బరుద్దీన్‌ ఓవైసీ మాటిమాటికి 15 నిమిషాలు అంటూ హిందువులపై, ఆర్‌ఎస్‌ఎస్‌పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్‌ ఓవైసీకి పిండ ప్రదానం చేయడం జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గతంలో స్వామి పరిపూర్ణానంద హిందువులలో చైతన్యం నింపడానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అవి మజ్లిస్‌కి వ్యతిరేకంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్వామీజీని నగర బహిష్కరణ చేయడం జరిగిందని గుర్తుచేశారు. మరి నేడు హిందూ మనోభావాలు ...

Read More »