నిజామాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టటానికి ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని కేంద్ర హౌసింగ్ పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను, కలెక్టర్లను కోరారు. మంగళవారం ఢిల్లీ నుండి ఆయన జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని రెండు విడతలుగా నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమం మొత్తం ముఖ్య ఉద్దేశం నీటిని సంరక్షించడం అని స్పష్టం చేశారు. ...
Read More »Daily Archives: July 2, 2019
వైద్యులకు సన్మానం
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే సందర్భంగా కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ఆరుగురు వైద్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ పి.యాదిరెడ్డి, సిడిఎస్ ఓకే కొండల రావు, డిఎం జితేంద్ర ప్రసాద్. పాల్గొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి పట్టణానికి చెందిన వైద్యులు న్యూరో ఫీజీషియన్ గీరెడ్డి రెడ్డి రవీందర్ రెడ్డి, పిల్లల నిపుణులు అరవింద్ కుమార్, ఆర్తో బి.ప్రవీణ్ కుమార్, కంటి వైద్య నిపుణులు విక్రమ సింహ రెడ్డి, టి.ప్రణీత, జనరల్ ఫీజీషియన్ డి.రమాదేవిలను ఘనంగా ...
Read More »చేపల పెంపకం దారులకు డీసీఎం పంపిణీ
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం, రెడ్డిపేట గ్రామంలోని చేపల పెంపకం దారుల సహకార సంఘానికి ఎమ్మెల్యే గంప గోవర్దన్ డిసిఎం వాహనం పంపిణీ చేశారు. వాహనాన్ని 75 శాతం సబ్సిడీపై అందజేస్తున్నట్టు తెలిపారు.
Read More »టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తాం
నిజాంసాగర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట్ సర్పంచ్ అనసూయకు సిడిసి చైర్మన్ దుర్గారెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ గైని విఠల్ చేతుల మీదుగా సభ్యత్వ నమోదు తీసుకున్నారు. అనంతరం సిడిసి చైర్మన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు వెల్గనూర్ రమేష్ గౌడ్, మాగి, కమ్మర్ కత్త అంజయ్య, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బోయిని సాయిలు, క్యాస ...
Read More »మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
నిజాంసాగర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని పిట్లం సర్పంచ్ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ నర్సగౌడ్లు అన్నారు. మంగళవారం నర్సరీని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ 5 మొక్కలను నాటి వాటి సంరక్షణ చూడాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.
Read More »మలేరియా నిర్మూలనకై అవగాహన ర్యాలీ
రెంజల్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేరియా మహమ్మారిని పారద్రోలాలంటే అందరి సహకారంతోనే మలేరియా వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని అందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కషి చేద్దామని మలేరియా సెక్టార్ అధికారి పిలుపునిచ్చారు. మంగళవారం మలేరియా, డెంగ్యూ నిర్మూలనకై అవగాహన ర్యాలీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ లేని ప్రపంచం కోసం కషి చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ...
Read More »రెంజల్ ఎంపీడీవోగా శ్రీనివాస్
రెంజల్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల ఎంపీడీవోగా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎంపీడీవోగా ఉన్న చంద్రశేఖర్ జూన్ 30 న పదవీవిరమణ పొందడంతో రెంజల్ మండల ప్రజాపరిషత్ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు ఇంచార్జ్ ఎంపీడీవోగా నియమించడంతో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Read More »చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలోని 90 మంది లబ్ధిదారులకు 84.35 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే గంప గోవర్దన్ పంపిణీ చేశారు. అలాగే కామారెడ్డి మున్సిపాలిటిలో సుమారు 33 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read More »రోడ్డు పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఆయన పట్టణంలో పర్యటించారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాల ముందు ఫుట్‌పాత్, పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు. ప్రజలు సహకరించి రహదారిని ఇరుకుగా కాకుండా ప్రజా రవాణాకు అనుగుణంగా ఉంచుకోవాలని సూచించారు. వాహనాలు అడ్డదిడ్డంగా కాకుండా క్రమపద్దతిలో ...
Read More »తెరాస పార్టీకి అపూర్వ స్పందన
బీర్కూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో తెరాస పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభిస్తుందని మండల తెరాస పార్టీ అద్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో తెరాస సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఆయా గ్రామాల్లో ప్రజలు తెరాస పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పురం వెంకట్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
Read More »