Breaking News
మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దశ్యం

మలేరియా నిర్మూలనకై అవగాహన ర్యాలీ

రెంజల్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేరియా మహమ్మారిని పారద్రోలాలంటే అందరి సహకారంతోనే మలేరియా వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని అందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కషి చేద్దామని మలేరియా సెక్టార్‌ అధికారి పిలుపునిచ్చారు. మంగళవారం మలేరియా, డెంగ్యూ నిర్మూలనకై అవగాహన ర్యాలీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ లేని ప్రపంచం కోసం కషి చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ వెంకటరమణ, ఏఎన్‌ఎంలు సుగుణ, సరోజ, శ్యామల, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *