Breaking News

Daily Archives: July 7, 2019

ప్రతినెలా వేతనాలు ఇప్పించండి

నిజాంసాగర్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న వర్క్‌ఛార్జి (గ్యాంగ్‌మెన్‌)లకు వేతనాలు రావడంలేదని ఆదివారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని మండల ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేను నీటి పారుదల శాఖ వర్క్‌ఛార్జి ఉద్యోగులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో వారు మాట్లాడి సమస్యను వివరించారు. ప్రతి నెల వేతనం రావడం లేదని ఆలస్యం కావడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు చేయించుకోవాలని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి తెరాస అభ్యర్థులు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, పిట్లం ఏఎంసీ చైర్మన్‌ గైని విఠల్‌, డిసిసిబి డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, గంగారెడ్డి సిడిసి చైర్మన్‌ దుర్గా ...

Read More »

పెద్దకోడప్‌గల్‌లో బోనాలు

నిజాంసాగర్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆషాడ మాసం ప్రారంభం సందర్భంగా పెద్ద కొడపగల్‌ మండల కుమ్మరులు బోనాల పండుగ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కుమ్మరి సంఘం సభ్యులు గ్రామంలో బోనాలతో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా కుమ్మరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి యాదగిరి మాట్లాడుతూ మండల కుమ్మరుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామన్నారు. బోనాలను ఊరేగించి గ్రామంలోని ముత్యాల పోచమ్మ, మహంకాళి అమ్మవారు, బారెడు పోచమ్మకు సమర్పించామని తెలిపారు. అమ్మవారికి తొలి బోనం కుమ్మరులదే ఉంటుందని, ఉత్సవాన్ని ...

Read More »

చంద్రమౌళీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

నిజాంసాగర్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని చంద్రమౌళి మౌళీశ్వర ఆలయంలో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ధపెదర్‌ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు సమద్ధిగా కురిసి పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని అన్నారు. వీరి వెంట సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, ఎంపిటిసి రీణ సందీప్‌, సర్పంచ్‌ ఉమ వినయ్‌ కుమార్‌, వైస్‌ ఎంపిపి మనోహర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

బోనమెత్తిన స్పీకర్‌

బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో నూతనంగా నిర్మించిన కనకదుర్గ ఆలయంలో బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం ఇటీవలే నిర్మించి ప్రారంభించారు. కాగా ఆదివారం కాలనీవాసులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. మహిళలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారి భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read More »