Breaking News

10న విద్యాసంస్థల బంద్‌

కామారెడ్డి, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం పోస్టర్లను కామారెడ్డి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేజీ నుడి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనిచెప్పి అమలు పరచడంలో విఫలమైందన్నారు.

ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. టిఆర్‌టి అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనం నిర్మించాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.

విధార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ బడుల మూసివేత ఆలోచనా విధానాన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్‌ కుమార్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినోద్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article