Breaking News

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం

బీర్కూర్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం జరుగుతుందని నసురుల్లాబాద్‌ తహసీల్ధర్‌ అర్చన అన్నారు. మండల కేంద్రంలో సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ అర్చన మాట్లాడుతూ గతంలో ప్రజావాణి కార్యక్రమం జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహించేవారని ప్రస్తుతం మండల స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.

సోమవారం ప్రజావాణిలో రెండు దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసం పంపామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌కు సంబంధించిన కోవిడ్‌ టెస్టుల‌ను బీర్కూర్‌ ...

Comment on the article