Breaking News

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిన నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అర్వింద్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపి మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దష్టి సారించబోతుందని, ఇందుకుసంబంధించి అమిత్‌ షా పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. 70 సంవత్సరాల అవినీతిని తొలగించడానికి నిఖార్సయిన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు.

క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ కోసం కేంద్రమే నిధులు ఇస్తుందని, ఆవాస్‌ యోజనంకోసం కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ వచ్చే ప్రాజెక్టుల కోసం మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఆయుష్మాన్‌ భారత్‌ అని, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్‌ కుటుంబం కమీషన్ల కోసమే ఆరాటపడుతుందని, ఇలాంటి కుటుంబ పార్టీలు మనకు వద్దని అన్నారు. మొన్నటి బడ్జెట్లో తెలంగాణకు 35 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, ఇందులో 20 వేల కోట్లు నేరుగా, మిగతా 15 వేల కోట్లు ఇతర గ్రాంట్ల ద్వారా కేంద్రం ఇస్తుందని అర్వింద్‌ అన్నారు.

మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో అయినా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఎంపి హితవు పలికారు. పసుపు రైతుల ఆశీర్వాదం తనతోనే కొనసాగుతుందని, పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గర్లో ఉందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఉన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article