Breaking News

మునిసిపల్‌ ఎన్నికల కోసం కార్యకర్తలు సన్నద్దం కావాలి

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మాజీ మంత్రి, శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 4, 5, 6, 7, 8 వార్డులలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ మున్సిపల్‌ కోర్‌ కమిటీ సభ్యులు కారంగుల అశోక్‌ రెడ్డి, పండ్ల రాజు, మోత్కూరి శ్రీనివాస్‌, సయ్యద్‌ అన్వర్‌, అహ్మద్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీని పటిష్టపరిచి రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించి కామారెడ్డి పట్టణాన్ని అభివద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఎలాంటి అభివద్ధి జరగలేదని రోడ్లన్నీ గుంతల మయమై నీటి ఇబ్బందులు, నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఎక్కడపడితే అక్కడ చెత్త ఉంటుందని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, దీనితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. పట్టణంలో అభివద్ధి జరిగితే అది మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆధ్వర్యంలోనే జరిగిందని స్టేడియం గాని పార్క్‌ గాని ఇలా కామారెడ్డిలో ఏదైనా అభివద్ధి జరిగింది అంటే కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు.

కామారెడ్డి అభివద్ధి పరచాలంటే కాంగ్రెస్‌ పార్టీ జెండా మునిసిపల్‌పై ఎగరాలన్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌, వార్డ్‌ లకు సంబంధించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అహ్మదుల్లా, నవాజ్‌, ఫెరోజ్‌ ఉద్దీన్‌ విట్టల్‌, శంకర్‌, దంతుల బాలరాజు, ఎల్లన్న, లక్ష్మి, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article