Breaking News

పోలీసు కవాతు

నందిపేట, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో సోమవారం ఉదయం రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. నందిపేట్‌ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్మూర్‌ ఏసిపి అందె రాములు మాట్లాడుతూ గ్రామాలలో వదంతులు నమ్మవద్దన్నారు. ఏదైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

విభిన్న కుల మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటూ శాంతిని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ రూరల్‌ సిఐ విజయ్‌ కుమార్‌, స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌, ఆర్‌ఏఆఫ్‌ బలగాలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ

నందిపేట్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్‌ రావడంతో ...

Comment on the article