Breaking News

మొక్కల సంరక్షణ చేపట్టాలి

బీర్కూర్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని హజిపూర్‌ గ్రామంలో సోమవారం ఎంపీపీ విఠల్‌ హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా హరిత హారంలో తమ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో మొక్కలు నాటీ వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు.

చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జన్నుబాయి, గ్రామ సర్పంచ్‌ అంజయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ పెరుక శ్రీనివాస్‌, కార్యదర్శి రజిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌కు సంబంధించిన కోవిడ్‌ టెస్టుల‌ను బీర్కూర్‌ ...

Comment on the article