Breaking News

జోరుగా తెరాస సభ్యత్వ నమోదు

నందిపేట, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జరిగింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేస్తున్నందున ప్రజలే ఉత్సాహంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇంచార్జి బాపురెడ్డి పేర్కొన్నారు.

నమోదు కార్యక్రమంలో నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గాదెపల్లి సర్పంచ్‌ నక్కల భూమేస్‌, ఎంపిపి వకిడి సంతోష్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌, బాలగంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ

నందిపేట్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్‌ రావడంతో ...

Comment on the article