Breaking News

పశువులకు గాలికుంటు టీకాలు

బీర్కూర్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామంలో సోమవారం పశు వైద్య అధికారులు ఆవులకు, గేదెలకు సోమవారం ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్బంగా గ్రామసర్పంచ్‌ యశోద మహేందర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు గ్రామంలో 162 గేదెలకు, 8 ఆవులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్‌, వైద్యాధికారులు రోహిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రావు, సంతోష్‌ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌కు సంబంధించిన కోవిడ్‌ టెస్టుల‌ను బీర్కూర్‌ ...

Comment on the article