Breaking News

Daily Archives: July 9, 2019

వేతనాల కోసం ధర్నా

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ విలీన గ్రామాల నర్సరీ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండడాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఐసిటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ మున్సిపల్‌ విలీన గ్రామాల్లో గతం నుంచి కొనసాగుతున్న నర్సరీ యొక్క నిర్వహణ కార్మికులు 100 మంది వరకు ఉంటారు. కాగా వీరికి మూడు ...

Read More »

మాచారెడ్డికి సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని బాలుర వసతి గృహానికి ఏఐఎస్‌ఎప్‌ సైకిల్‌ జాత చేరుకుంది. ఈ సంధర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు గణేష్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యార్థులకు నిలయంగా మారాయని అన్నారు. అంతే కాకుండా విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని కేజీ నుంచి పిజి ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్‌ నేడు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. సంక్షేమ హాస్టల్‌, జూనియర్‌ కళాశాలలు, ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హాసన్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల వల్లే పార్టీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వీ.గంగాధర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పిప్పిరి సుష్మా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో హిందూ ధర్మంపైన, దేవాలయాలపైన మతోన్మాదుల దాడులు అనేకంగా పెరుగుతున్నాయని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో దుర్గాదేవి ఆలయం మీద దాడి జరిగిందని, దేశంలో లవ్‌ జీహాద్‌ ద్వారా మతమార్పిడులు అధికామవుతున్నాయని విహెచ్‌పి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రతీ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ...

Read More »

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70 వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ అవిర్భావ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థి పరిషత్‌ చేసిన సేవా, నిర్మాణాత్మక అందోళనాత్మక కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు నరేష్‌, జంగం రాజాగౌడ్‌, నర్సింహరాజు, నరెందర్‌ రెడ్డి నారాయణ, భాను, లక్ష్మణ్‌, నిఖిల్‌, రాజు, మహేష్‌ కళాశాల విద్యార్థులు ...

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, కార్పెట్లు, బెడ్‌షీట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉమా వినయ్‌కుమార్‌, ఎంపిపి పట్లోల్ల జ్యోతి, దుర్గారెడ్డి, ఎంపిటిసి రీనారాని సందీప్‌, ఏఎంసి ఛైర్మన్‌ విఠల్‌ చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రావు, ఏసయ్యా, లింగాగౌడ్‌, వార్డెన్‌ జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

వసతి గృహంలో సామగ్రి పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అచ్చంపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు అందజేశారు. సర్పంచ్‌ అనసూయ, సత్యనారాయణ, ఎంపిటిసి సుజాత రమేశ్‌ చేతుల మీదుగా వీటిని అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారి జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సర్పంచ్‌ ఖాసిమ్‌ సబ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం మల్లూరు గ్రామ శివారులో హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ మనోహర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మొక్కటు నాటి సంరక్షణ చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో హైమద్‌, ఫీల్డ్‌ ...

Read More »

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబీవీపీ 70 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్లోని మోడల్‌ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ పతాక ఆవిష్కరణ చేసి మొక్కలు నాటారు. ఏబీవీపీ బాగ్‌ కన్వినర్‌ తులసిదాస్‌ మాట్లాడుతూ ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఓం ప్రకాష్‌ బిహాల్‌ నేతత్వంలో స్థాపించడం జరిగిందన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను దేశం యొక్క సంస్కతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఏబివిపి పనిచేస్తుందన్నారు. దేశం యొక్క అంతర్గత విషయాలపై నిరంతరం పోరాడుతూ సదా ...

Read More »

స్వచ్చ గన్‌పూర్‌

డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్చ గన్‌పూర్‌లో భాగంగా డిచ్‌పల్లి మండలంలోని గన్‌పూర్‌ గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామంలోని యువకులు కలిసి హనుమాన్‌ ఆలయం చుట్టు గత మంగళవారం గుంతలు తవ్వి, నేడు మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. స్వచ్చ గన్‌పూర్‌లో భాగంగా గ్రామంలోని ప్రతి వీధిలో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే సంకల్పంతో కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు.

Read More »

ముందు జాగ్రత్తలతోనే పంటల నష్ట నివారణ

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవగాహన, ముందు జాగ్రత్తల చర్యలతోనే పంట నష్టాన్ని నివారించడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ పై వ్యవసాయ అధికారులకు, ఏఈవోలకు, ఉద్యానవన అధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం ముందస్తుగా చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు అవగాహన కల్పించడం, వారు వ్యవసాయ అధికారుల ...

Read More »

ఊరు నందనవనం కావాలి

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్టే మానవ మనుగడకు ఆయువు పట్టని, చెట్టుతో విడదీయరాని అనుబంధం మనిషికి ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇండ్ల వద్ద మొక్కలు నాటితే తమ మాయపూర్‌ ఊరును నందనవనంలా మార్చుకోవచ్చని మాయపూర్‌ సర్పంచ్‌ అనురాధ పిలుపునిచ్చారు. హారితహారంలో భాగంగా గ్రామంలోని పలు వీధులలో మంగళవారం ఆమె మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ తెలంగాణను పచ్చని హారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ హరితహారం ఏర్పాటు చేశారన్నారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు ...

Read More »

పశువులకు టీకాలు

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని జిజి నడ్కుడ, గాదెపల్లి గ్రామాలలో బుధవారం పశు వ్యాధినిరోధక కార్యక్రమాన్ని మండల పశు వైద్య అధికారి హన్మంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటేనేే రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందుతారన్నారు. నడుకుడ గ్రామ సర్పంచ్‌ బద్దం మధులిక మాట్లాడుతూ డాక్టర్లు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి పశువులకు వ్యాధులు రాకుండా చూసుకోవాలని కోరారు. మంగళవారం రెండు గ్రామాల్లో సుమారు 1300 పశువులకు టీకాలు ...

Read More »