Breaking News

జనాభా నియంత్రణకు అవగాహన కల్పించాలి

రెంజల్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరు తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని మండల వైద్యాధికారి క్రిస్టినా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీనీ ప్రారంభించారు. గాంధీ చౌరస్తా మీదుగా పలు వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను నియంత్రించినప్పుడే ఏ కుటుంబమైనా, దేశమైనా అభివద్ధి సాధిస్తుందని తెలిపారు. అధిక జనాభా వల్ల కుటుంబపరంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు పలు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని, అధిక జనాభాను నిరోధించడానికి కుటుంబ నియంత్రణ తదితర పద్ధతులను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఈవోలు వెంకటరమణ, విజయ్‌కుమార్‌, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article