నిజామాబాద్, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్టి ద్వారా సెలెక్ట్ చేయబడిన ఉపాధ్యాయుల నియామకం నిబంధనలను అనుసరించి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఉపాధ్యాయుల నియామకంపై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిక చేసి పంపబడిన 103 మంది ఉపాధ్యాయుల జాబితాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేయాలన్నారు.
విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలలో ఇబ్బందులు ఉన్నచోట నియామకాలు ప్రాధాన్యతతో చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపిక చేయబడిన అభ్యర్థుల ధ్రువ పత్రాలు ఇప్పటికే పరిశీలన పూర్తయినందున నియామకాలు జారీ చేసే ముందు మరొకసారి రికన్సిలేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు. నియమింపబడిన అధ్యాపకుల వివరాల జాబితాలను అవసరమైన చోట ప్రదర్శించాలని వాటి ఫోటోలను కూడా తీసి పెట్టుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నియామకాల ద్వారా ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు జరగాలని ఆయన సూచించారు.
సమావేశంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల డిఈవోలు దుర్గాప్రసాద్, రాజు, జిల్లా పరిషత్ సీఈవో గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021