Breaking News

జనాభా నియంత్రణ అందరి బాధ్యత

నిజామాబాద్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా నియంత్రణతోనే అభివద్ధి సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆయన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను నియంత్రించినప్పుడే ఏ కుటుంబమైనా దేశమైనా అభివద్ధి సాధిస్తుందని తెలిపారు. జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరు తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని జనాభా నియంత్రణకు అందరూ కట్టుబడి ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

అధిక జనాభా వల్ల కుటుంబ పరంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు పలు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. పరిమిత కుటుంబంవల్ల తల్లి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అధిక జనాభాను నిరోధించడానికి కుటుంబ నియంత్రణ తదితర పద్ధతులను అవలంభించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో తుకారం రాథోడ్‌, డెమో గంగాధర్‌, హెచ్‌ఈ వెంకటేష్‌, ఏవో శోభన్‌, ఆశా వర్కర్లు, నర్సింగ్‌ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article