Breaking News

వర్షాల కోసం జలాభిషేకం

నిజాంసాగర్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు సమృద్ధిగా కురవాలని నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి హనుమాన్‌ ఆలయంలో జలాభిషేకం చేశారు. అనంతరం వైస్‌ ఎంపీపీ మనోహర్‌ మాట్లాడుతూ వర్షాలు భారీగా కురిసి తెలంగాణలోని పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని హనుమాన్‌ మందిర్‌లో జలాభిషేకం చేయడం జరిగిందన్నారు.

రైతులందరూ వర్షాలు కురిస్తే పొలాలు వేసుకోవడం జరుగుతుందని, దేవుని కపతో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నదులు నిండుకుండలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లూర్‌ సర్పంచ్‌ ఖాసీంసాబ్‌, నాయకులు హైమద్‌, గ్రామ పెద్దలు ఉన్నారు.

Check Also

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ...

Comment on the article