Breaking News

అంజనాద్రి ఆలయంలో భజన కార్యక్రమం

నిజాంసాగర్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులోని అంజనాద్రి ఆలయంలో మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పట్లోల కిషోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాత్రి వేళల్లో అంజనాద్రి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిచ్కుంద, గోర్గల్‌, గున్కుల్‌, మొహమ్మద్‌ నగర్‌ గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిజాంసాగర్‌ ఎస్‌ఐ సాయన్నకు పట్లోళ్ల కిషోర్‌ కుమార్‌ పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ కుమార్‌, గ్రామ నాయకులు, పెద్దలు ఉన్నారు.

Check Also

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ...

Comment on the article