Breaking News

క్రమశిక్షణ గల కార్యకర్తలే బిజెపికి బలం

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ లింగాపూర్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ జండా ఆవిష్కరించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతు మోదీ నాయకత్వంలో, అమిత్‌ షా మార్గ నిర్ధేశకత్వంలో దేశంలో కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు గ్రామ గ్రామాన బీజేపీ విస్తరించిందని, దేశభక్తి ఊపిరిగా కలిగిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే బీజేపీకి బలమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యకర్తల సమిష్టి కషితో ముందుకు వెళ్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ఎండగడతామని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో సభ్యత్వ నమోదు అంచనాలకు మించి జరుగుతుందని బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే యువత 8980808080 నెంబరుకు మిస్‌ కాల్‌ చేయాలన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article