Breaking News

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం గాంధీనగర్‌కి చెందిన 20 మంది యువకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. అదే విధంగా ఆదివారం కామారెడ్డి 7వ వార్డు పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ యువతకు అడ్డాగా మారిందని, కామారెడ్డిలో యువకుల చేరికతో నూతనోత్తేజంతో పురపాలక ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతుందని, ఇది చూసి ఓర్వలేక అధికార పార్టీ ప్రభుత్వ అధికారులతో అడ్డ దారిలో వెళ్తుందని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డిని మళ్ళీ అవినీతి నాయకుల చేతుల్లోకి పోనిచ్చేది లేదని కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article