Breaking News

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మర్కల్‌ మల్లన్నగుట్ట మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న ఓ యువకుడు ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మల్లన్నగుట్ట వద్దగల నీటి ట్యాంకు నుంచి నీటిని శుద్దిచేసి కామారెడ్డి పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అక్కడ పనిచేస్తున్న పోసానిపేట గ్రామానికి చెందిన చాకలి నర్సింలు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.

దీంతో అతని కుటుంబీకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి భారీగా తరలివచ్చారు. మృతుని భార్యకు ఉద్యోగంతోపాటు పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆందోళన చేశారు. అధికారులు, పోలీసులు వచ్చి మృతుని కుటుంబీకులను శాంతింపజేశారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article