Breaking News

రూ. 19 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలో రూ. 19 కోట్లతో చేపట్టే పలు అభివద్ధి పనులకు రాష్ట్ర రవాణా, రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. శనివారం ఆయన భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ.19 కోట్లతో భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే పనులు సిసి / బిటి రోడ్లకు, సీసీ మురుగు కాలువలకు పదిహేను కోట్ల రూపాయల అంచనాతో చేపట్టడానికి శంకుస్థాపనలు నిర్వహించారు. ఆరు స్మశాన వాటికలకు కోటి రూపాయలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్‌ల అభివద్ధికి కోటి రూపాయలు, పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ కొరకు కోటి రూపాయలు, కళ్యాణ మండపం నిర్మాణానికి మరో కోటి రూపాయలు కేటాయించి పనులను చేపట్టడానికి ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గతంలో భీమ్‌గల్‌ పట్టణ అభివద్ధికి 4 కోట్ల రూపాయలను కేటాయించి పనులను పూర్తి చేసినప్పటికీ ఇంకా పనులు మిగిలి ఉన్నందున భీమ్‌గల్‌ మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అదనపు నిధులు మంజూరు చేసుకునే వెసులుబాటు కలగడంతో మొత్తం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 19 కోట్ల రూపాయలకు శనివారం శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. మంజూరైన 25 కోట్లలో 19 కోట్లు శనివారం శంకుస్థాపన చేసిన పనులకు పోను మిగతా ఆరు కోట్లు అవసరమైనప్పుడు వాడుకోవడానికి కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.

ట్యాంక్‌ బండ్‌ కొరకు ఇంతకుముందే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయన్నారు. పనులతో బీమ్‌గల్‌ పట్టణాన్ని ఆరు నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ కమిషనర్‌, ప్రత్యేక అధికారి వ్యక్తిగత శ్రద్ధతో పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కొత్తగా ఆసరా పెన్షన్‌లు మంజూరైన వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో భీమ్‌గల్‌ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి / ఆర్మూర్‌ ఆర్‌డివో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, ఎంపీపీ మహేష్‌, జడ్పీటీసీ రవి, ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు హాజరయ్యారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article