Breaking News

గురుకుల పాఠశాల తనిఖీ

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆదివారం ఆకస్మికంగా తనికీ చేశారు. వంటగది, స్నానపు గదులు, నీటి సమస్య తదితర సమస్యలు తెలుసుకున్న షబ్బీర్‌ అలీ సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పోరాడి ఎంతో కష్టపడి 11 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రంలో 5 ఎకరాల స్థలంలో 13 కోట్ల నిధులతో నూతన భవనం నిర్మించామన్నారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్‌ కార్యాలయం కోసం భవనం వాడుకుంటున్నారని, మూడు సంవత్సరాలు అవుతున్న నూతన కలెక్టర్‌ భవనం పూర్తి చేయలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసిర్‌ 204 గురుకులాలను ఏర్పాటు చేశారని, ఒక్క భవనం కూడా సొంతంగా లేదని, అన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, ఒక్క భవనంలో కూడా విద్యార్థులకు సరైన వసతులు లేవని, జిల్లా కేంద్రంలో ఉన్న మైనారిటీ పాఠశాలలో వసతులు కరువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు, భోజన వసతి, టాయిలెట్స్‌ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

భోజనాలు కూడా ఆరుబయట ఎండలో కూర్చుని చేయాల్సి వస్తుందని, వర్షం పడితే అదే క్లాస్‌ రూమ్‌ అదే భోజన గదిలా మారుతుందన్నారు. నీటి కొరతతో కాలనీలో తిరుగుతూ నీళ్లు అడుక్కోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పిల్లలు రోగాల బారిన పడే ప్రమాదముందని, విద్యార్తులకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article