Breaking News

పొట్టకూటి కోసం వస్తే..ప్రాణమే పోయింది

నందిపేట్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం కేంద్రంలోని రాజ్‌నగర్‌ దుబ్బలో ఇంటి పైకప్పు కూలడంతో దినసరి కూలి కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం… జీవనోపాధి కోసం ప్రకాశం జిల్లా కేసముద్రం మండలం ఎర్రుపాలెం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబం నందిపేట మండల కేంద్రానికి శుక్రవారం రాత్రి వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలింది. దీంతో అంజయ్య కుమార్తె రేణుక మతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మొదటి కూతురు శాంతకుమారికి కాలు విరగగా, కొడుకు మాలకొండయ్య నడుముకు బలమైన గాయమైంది. పొట్టకూటి కోసం ఇంత దూరం వస్తే కడుపుకోత మిగిలిందంటూ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.

Check Also

సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ

నందిపేట్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్‌ రావడంతో ...

Comment on the article