Breaking News

చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి

నిజామాబాద్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అన్నారు. అన్ని వర్గాల అభివద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అహర్నిశలు కషి చేస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం బింగి కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో ముందుకు సాగేలా తెరాస ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు.

పద్మశాలీయులైన చేనేత కార్మికుల నుండి బతుకమ్మ చీరలు కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన గుర్తు చేశారు. బంగారు తెలంగాణా కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కషి మరవలేనిదని, ప్రతి ఒక్కరూ ఈ సత్కార్యంలో పాలుపంచుకోవాలని విఠల్‌ రావు పిలుపునిచ్చారు. నిజామాబాదు నగరంలో పద్మశాలి వసతిగహం, కళ్యాణ మండపం, శ్మశాన వాటిక, సంఘ భవనాలు తదితర వాటి కోసం తమ పార్టీకి చెందిన అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. పద్మశాలిలు ఐక్యంగా ఉండి అభివద్ధి సాదించాలని ఆయన ఉద్బోదించారు. నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గంచే ఎన్నికల అధికారి డాక్టర్‌ సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మ్యాన సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు గోషిక యాదగిరి, జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ వనం దేవిదాస్‌, అద్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి, పుల్గం హన్మాండ్లు, మాజీ అధ్యక్షుడు నందకుమార్‌, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్‌, డిచ్‌పల్లి ఎంపిపి గద్దె భూమన్న, మాజీ కార్పోరేటర్‌ ఎనగందుల మురళి, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు బిజ్జు దత్తాద్రి, రాపెల్లి గురుచరణం, జిల్లా యువజన అధ్యక్ష కార్యదర్శులు సిలివేరి గణేష్‌, చింతల గంగాదాస్‌, పద్మశాలి సంఘం ప్రతినిధులు ఎస్‌ఆర్‌ సత్యపాల్‌, గుండ సరోజ, గుడ్ల చంద్రభాగ, గంగుల రాజేందర్‌, మెరుగు లక్ష్మినారాయణ, మచ్చ చంటయ్య, బింగి ప్రకాష్‌, స్వర్గం లక్ష్మినర్సయ్య, లోలం జగదీష్‌, లోల శంకర్‌, బొద్దుల రాజారాం, బల్ల లక్ష్మిభాయి, పెంట దేవిదాస్‌, అందె నరేందర్‌, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article