Breaking News

ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలైన పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాన్ని ప్రతి యేటా ఆనవాయితీగా నిర్వహిస్తారు. రెంజల్‌ మండల కేంద్రంలో ఆదివారం గ్రామస్థులందరు కలిసి ఒకే చోటుకి చేరి బోనాలతో తరలి వెళ్తారు. ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ గ్రామస్తులతో కలిసి బోనమెత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో ఘనంగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, గ్రామ పెద్దలు కిషోర్‌, లడ్డు, సంతోష్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article