Breaking News

ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

నిజాంసాగర్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌ మున్సిపల్‌ పరిధిలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసేందుకు అన్ని రకాలుగా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల అభివద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి వారికి లబ్ధిచేకూర్చడం జరుగుతుందని తెలిపారు.

అన్ని వర్గాలకు కల్యాణలక్ష్మీ, షాది ముభారక్‌ పథకాలు అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి రూ.1,00116 లక్ష నూట పదహారు ఆర్థిక సహాయం అందించి ఆడపిల్ల పెండ్లి బ్రహ్మాండంగా జరిగేటట్టు చేసిందన్నారు. వ్యవసాయ రైతులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ రైతు అపద్బాందువుడు అని కొనియాడారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో వ్యవసాయ రైతులకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారాలు అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రైతులు రెండు పంటలు పండించుకువడానికి రైతు బంధు ద్వారా ఎకరానికి 5 వేల రూపాయలు అందించి పంటలు వేసుకోవడానికి ప్రోత్సహిస్తుందన్నారు. అలాగే రైతు భీమా కల్గిన వారు అకస్మాత్తుగా చనిపోతే రైతు కుటుంబం అప్పుల పాలు కాకూడదని భీమా కల్గిన నామినికి 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని స్పీకర్‌ అన్నారు.

నియోజక వర్గంలో ప్రతి ఇంటి నుంచి తెరాస పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ మాట్లాడుతూ భారత దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ప్రజా పాలన ఆయా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ తెలిపారు. కాళేశ్వరం ద్వారా నియోజక వర్గంలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవడానికి అనేక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పరిచి వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణయేనని స్పష్టం చేశారు.

అలాగే యాదవ్‌, కుర్మలకు సబ్సిడీ ద్వారా గొర్రెలను పంపిణీ చేసి అన్ని వర్గాలకు ప్రతి సంవత్సరం వారి జీవన ఉపాధికి సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం జరిగిందని ఎంపీ బీబీ పాటిల్‌ తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ మాట్లాడుతూ నియోజక వర్గాన్ని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో అన్ని రకాలుగా అభివద్ధికి తోడ్పడతానని తెలిపారు. నియోజక వర్గ ప్రజల కోసం అందుబాటులో ఉండి వారికి సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రజలకు ప్రజలు కోరుకునే పాలన అందించడం రాష్ట్ర ప్రజల అదష్టమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీటిని అందించడం, గ్రామాలలో చెరువులు బాగుండాలని కాకతీయ మిషన్‌ ద్వారా చెరువులను బాగుచేయడం ప్రతి గ్రామానికి కొత్త తారు రోడ్డు వేసి గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పర్చడం జరిగిందని తెలిపారు.

వద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పించన్లు, రైతుబందు, రైతుబీమా, సబ్సిడీ విత్తనాలు ఇలా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లబ్ధిచేకూర్చడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శోభ ధపెదార్‌ రాజు, జడ్పీటిసి , ఎంపీపీ, తెరాస పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ...

Comment on the article