కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో బట్టల దుకాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలో రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో వ్యవసాయ రుణమాపీతోపాటు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ చొరవతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు తయారుచేసి ...
Read More »Daily Archives: July 15, 2019
జనహిత పెండింగ్ దరఖాస్తులు పరిస్కరించాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనహితలోని పెండింగ్ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం జనహితలో జిల్లా అధికారులతో ఏర్పాటైన కన్వర్జెన్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వశాఖలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ఆర్థిక సాయంపై తమ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్లోపూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. అనంతరం సంక్షేమ కార్యక్రమాలపై ప్రజెంటేషన్ చేశారు. ...
Read More »నీటిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటిని సంరక్షించుకోవడం ద్వారానే భవిష్యత్తు ఉంటుందని లేకుంటే నీటి ఎద్దడిని కొనితెచ్చుకోవడమేనని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో సోమవారం జలశక్తి అభియాన్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా చెరువులు, కుంటలు, గుంతలను నీటి సంరక్షనలో భాగంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తాగునీరు రీచార్జ్ చర్యలు చేపట్టాలన్నారు. చెట్టు ప్రాధాన్యతపై విద్యార్తులు సాంస్కృతిక ...
Read More »ప్రజావాణిలో 47 ఫిర్యాదులు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 47 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూశాఖ-25, మీసేవా-3, డిపివో-4, సిఎంఓ-1, డిఆర్డివో-4, బిసి కార్పొరేషన్-1, ఎక్సైజ్-1, ఆర్టీవో-1, మార్కెట్-1, డిఇవో-2, డిపిఆర్ఇ-1, విద్యుత్-1, డిటిడివో-1, ఆర్అండ్బి-1 ఫిర్యాదులు అందాయన్నారు. కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 18 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ...
Read More »హమాలీల సమస్యలు పరిష్కరించాలి
కామరెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రదాన కార్యదర్శి ఎల్.దశరథ్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ పథకాన్ని కొనసాగిస్తూ 14 రకాల నిత్యవసరాల వస్తులను ప్రజలందరికీ రేషన్ షాపుల ద్వారా అందించాలన్నారు. అలాగే అర్హులందరికీ ఆహర భద్రత రేషన్ కార్డులు ఇవ్వాలని అంతే కాకుండా నగదు ...
Read More »రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గరుగుల్ గ్రామంలో జడ్పిహెచ్ఎస్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకిచుకోవడం, సోక్ ఫిట్స్ ట్రెంచెస్ వాటర్ టేబుల్ మొక్కల పెంపకం భూగర్భ జలాలను పెంపొందించుకోవడంపై అవగాహన కల్పించి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవితేజ గౌడ్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్మిపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే శాబ్దిపూర్ గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అవగాహన, ...
Read More »జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందిన హైదరాబాద్ కవాడిగూడ నమస్తే తెలంగాణ రిపోర్టర్ విజయ్ కుమార్ కుటుంబానికి సోమవారం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కవాడిగూడలోని ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసన సభ్యులు ముఠా గోపాల్, నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, స్థానిక కార్పోరేటర్ లాస్య నందితలు పాల్గొని విజయ్ భార్యకు ఐదు లక్షల ఎఫ్డీ బాండ్, ...
Read More »మాడల్ స్కూల్ తనిఖీ
రెంజల్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను సోమవారం ఎంపీపీ లోలపు రజినీ కిషోర్, జడ్పీటీసీ విజయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి హాజరు కావాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యోగేష్, మాజీ ఎంపిటిసి కిషోర్, ...
Read More »నూతనంగా ఎంపికైన ఎస్సైని సన్మానించిన సర్పంచ్
రెంజల్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన అమాంద్ అరవింద్ అనే యువకుడు శుక్రవారం వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో ఎస్ఐగా ఎంపికవ్వడంతో గ్రామ సర్పంచ్ కాశం నిరంజని సాయిలు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ నిరంజని మాట్లాడుతూ గ్రామంలోని యువత అరవింద్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన గ్రామానికి చెందిన యువకుడు ఎస్ఐగా ఎంపికవ్వడం ఆదర్శనీయమని అన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా జన్మనిచ్చిన ఊరిని మరిచిపోవద్దని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జలయ్య, ...
Read More »అన్నని చంపిన తమ్ముడు
రెంజల్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యానికి బానిసైన తమ్ముడు తోడబుట్టిన అన్ననే కడతేర్చిన సంఘటన రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కలిమ్ ప్రతి రోజు మద్యం సేవించి ఇంట్లో తరచూ గొడవలు సష్టిస్తున్నాడు. సంపాదించిన డబ్బు తాగడానికి ఖర్చు చేస్తే పిల్లల పోషణ భారమైతుందని తల్లి మున్నిసా బేగం, అన్న కలిల్ ఖురేషి తమ్ముడు కలిమ్ని మందలించారు. కోపోద్రిక్తుడైన కలిమ్ అన్నపై కత్తితో దాడి చేయడంతో ఖురేషికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ...
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
బీర్కూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన గూన్నామా రాములు అనే వ్యక్తికి రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను మాజీ జడ్పీటీసీ కిషోర్ యాదవ్, సర్పంచ్ శ్యామల అందజేసారు. గత జనవరి నెలలో గూన్నామా రాములుకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో హైద్రాబాద్ రష్ ఆసుపత్రీలో చికిత్స పొంది సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా రూ. 60 వేల చెక్ మంజూరైందని మాజీ జడ్పీటీసీ కిషోర్ ...
Read More »మునిసిపల్ ఎన్నికల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూర్ , భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బాగంగా పోలింగ్ అధికారులైన పిఓ ఏ పిఓల మొదటి దశ ర్యాండమైజేషన్ (నియామక) పక్రియను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఎన్ఐసిలో పిఓ, ఏపిఓల ర్యాండమైజేషన్ పక్రీయను పూర్తి చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటుగా ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలలో 146 వార్డులు, 580 పోలింగ్ కేంద్రాలలో అనుకున్న లక్ష్యం కంటే ...
Read More »