జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం జనహితలో జిల్లా అధికారులతో ఏర్పాటైన కన్వర్జెన్స్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వశాఖలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ఆర్థిక సాయంపై తమ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్లోపూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చూడాలని చెప్పారు.

అనంతరం సంక్షేమ కార్యక్రమాలపై ప్రజెంటేషన్‌ చేశారు. జలశక్తి అభియాన్‌ ద్వారా వర్సపు నీటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారంపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, డిఆర్‌డివో పిడి చంద్రమోహన్‌రెడ్డి, సిఇవో (జడ్పి) కాంతమ్మ, సిపివో శ్రీనివాస్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *