కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట జూనియర్ కళాశాల యాజమాన్యం అనుమతి లేకుండా అమ్మాయిలు, అబ్బాయిల వసతి గృహాలను ఒకేచోట నిర్వహిస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎంసిపిఐయు పార్టీ కార్యదర్శి రాజలింగం ఇంటర్మీడియట్ నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టల్‌పై తగు చర్యలు తీసుకోవాలని, అక్రమ విద్యావ్యాపారం చేస్తున్న ఆర్యభట్ట కళాశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More »Daily Archives: July 17, 2019
ఫోన్ ఇన్ ద్వారా ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలి
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఫోన్ ఇన్ కార్యక్రమంలో భూ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారితో ఆయన నేరుగా మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూ సమస్యలకు సంబంధించి ప్రజలు కలెక్టర్‌తో మాట్లాడారు. ఫోన్లో సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత తహసీల్దార్లు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, ...
Read More »రైతులకు పంట రుణాలు రూ. 137 కోట్లు పంపిణీ
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2019-20 వార్షిక ప్రణాళికకు సంబంధించి జూన్ చివరి వరకు రైతుల పంట రుణాలకు సంబంధించి 137 కోట్లు బ్యాంకుల ద్వారా రైతులకు అందజేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం జనహితలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నాబార్డు, ఆర్బిఐ, జిల్లా బ్యాంకు కంట్రోలింగ్ అధికారులతో జిల్లా సమాలోచన కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 2019 జూన్ 2019 త్రైమాసికాలకు సంబంధించి వివిద ...
Read More »22న కలెక్టరేట్ ముట్టడి
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుదవారం కామారెడ్డి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, తాగునీటి సమస్య, భూ సమస్య, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని జులై 22న కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిదంగా రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు రాక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. ...
Read More »మనస్తాపంతో ఖైదీ ఆత్మహత్య
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వడ్ల వెంకటి (65) హత్య కేసులో జీవిత ఖైదు వేయడంతో మనస్థాపానికి గురై నిజామాబాద్ జిల్లా జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »బీడీ కార్మికుల ధర్నా
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో బీడీ కార్మికులకు రూ. 2016ల జీవన భతి ఇస్తామని నేటికి ఇవ్వనందున బుధవారం తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యునియన్, సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆద్వర్యంలో మాచారెడ్డిలో ర్యాలి, తహసీల్దారు కార్యాలయం ముందు దర్నా చేసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యునియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ...
Read More »40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు విస్థారకుల కార్యశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో 40వేల సభ్యత్వం పూర్తి చేయాలని దానికి సంబంధించిన మండల, గ్రామ, బూత్ స్థాయి ఇంచార్జిలను నియమించి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. తెలంగాణలో యువత స్వచ్చందంగా బీజేపీలో సభ్యత్వం ...
Read More »హత్య కేసులో క్షమాభిక్ష లేఖకు అంగీకారం..
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ హత్య కేసులో 19 ఏళ్లుగా షార్జా జైలులో ఉన్న జగిత్యాల జిల్లాకు చెందిన బుచ్చన్నకు క్షమాభిక్ష పెట్టడానికి బాధితురాలు ఒప్పుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట్‌కు చెందిన దరూరి బుచ్చన్న 2001లో షార్జాకు వెళ్లాడు. అయితే అక్కడ తనతో కలిసి ఉన్న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన బి.గోవర్దన్‌తో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ...
Read More »జేఎస్వై వివరాలు పోర్టల్‌లో నమోదు చేయండి
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జల శక్తి అభియాన్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో జల శక్తి అభియాన్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో జల శక్తి అభియాన్ క్రింద గుర్తించిన 5 బ్లాక్‌లతోపాటు ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్న నీటి సంరక్షణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఫోటోలతోపాటు అన్ని వివరాలతో జల శక్తి ...
Read More »పాఠశాల తనిఖీ
రెంజల్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి పాఠశాలను బుధవారం ఎంపీపీ లోలపు రజినీ కిషోర్, జడ్పీటీసీ మేక విజయ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని ...
Read More »విద్యార్థుల జీవితాలతో చలగాటమా
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఆర్-15, ఆర్-16, ఆర్-18 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవటంపై నిజామాబాద్ ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి భాను ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో నిరసన వ్యక్తం చేసి కళాశాల ప్రిన్సిపాల్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరధ బట్టు వేణు రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాద్రి మాట్లాడారు. ...
Read More »