రైతులకు పంట రుణాలు రూ. 137 కోట్లు పంపిణీ

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019-20 వార్షిక ప్రణాళికకు సంబంధించి జూన్‌ చివరి వరకు రైతుల పంట రుణాలకు సంబంధించి 137 కోట్లు బ్యాంకుల ద్వారా రైతులకు అందజేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం జనహితలో లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నాబార్డు, ఆర్‌బిఐ, జిల్లా బ్యాంకు కంట్రోలింగ్‌ అధికారులతో జిల్లా సమాలోచన కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 2019 జూన్‌ 2019 త్రైమాసికాలకు సంబంధించి వివిద ప్రాధాన్యత రంగాల్లో లక్ష్యాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు.

వ్యవసాయ రంగంలో గత సంవత్సరం పంట రుణాలు 80 శాతం, వ్యవసాయ రంగంలో 71 శాతం లక్ష్యాలను సాధించినట్టు తెలిపారు. గత ఏడు రుణ ప్రణాళిక కింద 3155 కోట్లు లక్ష్యం కాగా 2113 కోట్ల రుణాలు అందించి 67 శాతం లక్ష్యసాధన చేసినట్టు తెలిపారు. ఈయేడు మొదటి మూడు నెలలకు గాను 137 కోట్లు పంట రుణాలు అందజేశామన్నారు. వచ్చే ఆగష్టు లోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా గత ఏడు 230 కోట్లు రుణాలు పంపిణీ చేశామని, ఈయేడు ఇప్పటి వరకు 72 గ్రూపులకు 5 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. వివిధ రుణాలను పంపిణీ చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

రైతులందరు పంట రుణాలు రినివల్‌ చేసుకోవాలని, వడ్డి రాయితీ, పంట బీమా పొందేందుకు ఆగష్టు 31 వరకు సమయం ఉందని తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు అధికారి రాజేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, నాబార్డు డిడిఎం వాసుదేవరావు, ఆర్‌బిఐ అధికారి ఏ.ఎం.ఖాన్‌, జిల్లా వ్యవసాయాదికారి నాగేంద్రయ్య, పరిశ్రమల అధికారి రఘనాథ్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి బాలయ్య, మెప్మా అధికారి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *