హత్య కేసులో క్షమాభిక్ష లేఖకు అంగీకారం..

నిజామాబాద్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్కాల్‌ హత్య కేసులో 19 ఏళ్లుగా షార్జా జైలులో ఉన్న జగిత్యాల జిల్లాకు చెందిన బుచ్చన్నకు క్షమాభిక్ష పెట్టడానికి బాధితురాలు ఒప్పుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… జగిత్యాల జిల్లా రాయకల్‌ మండలం కొత్తపేట్‌కు చెందిన దరూరి బుచ్చన్న 2001లో షార్జాకు వెళ్లాడు. అయితే అక్కడ తనతో కలిసి ఉన్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల కేంద్రానికి చెందిన బి.గోవర్దన్‌తో గొడవ పడుతుండే వాడు.

ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణలో గోవర్ధన్‌ మరణించాడు. దీంతో అక్కడి న్యాయస్థానం బుచ్చన్నకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి అతను షార్జా జైలులోనే మగ్గుతున్నాడు. ప్రస్తుతం బుచ్చన్న మానసిక స్థితి బాగాలేదని, మాట్లాడే స్థితిలో కూడా లేడని బుచ్చన్న అన్నదమ్ములైన లక్ష్మణ్‌, లింగన్న, కుటుంబ సభ్యులు మంగళవారం ముప్కాల్‌లోని గోవర్దన్‌ భార్య ఇంటికి వచ్చి మొర పెట్టుకున్నారు.

పెద్ద మనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష పెట్టాలని కోరారు. క్షమాబిక్ష పెడితే శిక్ష రద్దు చేస్తారని వేడుకోగా ఎట్ట కేలకు గోవర్దన్‌ భార్య రాధ ఒప్పుకుంది.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *