నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జల శక్తి అభియాన్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో జల శక్తి అభియాన్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో జల శక్తి అభియాన్ క్రింద గుర్తించిన 5 బ్లాక్లతోపాటు ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్న నీటి సంరక్షణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఫోటోలతోపాటు అన్ని వివరాలతో జల శక్తి అభియాన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.
నీటి ఇబ్బందులు ఉన్న ఐదు మండలాలను ఈ కార్యక్రమం కింద గుర్తించినందున ఈ మండలాలకు నోడల్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఆ మండలాలలో నీటి సంరక్షణకు అవసరమైన కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా వర్షపు నీరు వధా పోకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడం, చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల నిర్మాణం, వాటర్షెడ్ల ఏర్పాటు, పెద్ద ఎత్తున మొక్కలు నాటి చెట్లను పెంచడానికి సంబంధిత శాఖలను, మండల స్థాయి అధికారులను, ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసుకుంటూ సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఈ మంత్రిత్వ శాఖ మరియు జల శక్తి అభియాన్ పోర్టల్లో ఏరోజుకారోజు జరుగుతున్న కార్యక్రమాలను నమోదు చేయించాలని, తద్వారా మాత్రమే జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు ఈ మంత్రిత్వ శాఖ దష్టిలో ఉంటాయన్నారు.
భవిష్యత్తులో ఏర్పడే నీటి ఇబ్బందులను ప్రజలకు తెలియజేసి నీటిని పొదుపుగా వాడడంతో పాటు వాడిన నీటిని తిరిగి సద్వినియోగంలోకి తీసుకు రావడానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జల శాఖ, డిఆర్డిఎ శాఖల అధికారులు ఈ కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. సమావేశంలో గ్రౌండ్ వాటర్ శాఖ ఉప సంచాలకులు ప్రసాద్, డిఆర్డిఓ రమేష్ రాథోడ్, ఇన్చార్జి డిపిఓ కష్ణమూర్తి, నీటిపారుదల శాఖ ఈఈ రాధాకిషన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, ఉద్యానవన శాఖ డిడి, ఇతరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం - December 14, 2019
- మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం - December 14, 2019
- సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి - December 14, 2019