Breaking News

పాఠశాల తనిఖీ

రెంజల్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి పాఠశాలను బుధవారం ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో చర్చించారు.

పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ గణేష్‌ రావ్‌, సర్పంచ్‌ సాయరెడ్డి మాజీ ఎంపిటిసి కిషోర్‌, ప్రధానోపాధ్యాయుడు దేవిదాస్‌, పిఆర్‌టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *